ముగిసిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు
ABN , First Publish Date - 2022-12-31T05:52:17+05:30 IST
రాష్ట్ర యువజన సర్వీసు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో 3 రోజులుగా జరుగుతు న్న యువజనోత్సవాలు శుక్రవారం ముగిశాయి.
తాడేపల్లి, డిసెంబరు 30: రాష్ట్ర యువజన సర్వీసు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో 3 రోజులుగా జరుగుతు న్న యువజనోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు సభకు మంత్రి రోజా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. యువజనోత్సవాల ముగిం పు సభలో ఆంధ్రా వర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి ప్రధాని మోదీ, సీఎం జగన్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ, జగన్‌లు దేశానికి వరమని పేర్కొన్నారు.