-
-
Home » Andhra Pradesh » The problems of the employees should be solved-NGTS-AndhraPradesh
-
వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-09-19T09:59:42+05:30 IST
రాష్ట్ర వ్యవసాయశాఖలో మినిస్టీరియల్ స్టాఫ్ సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని వ్యవసాయశాఖ

అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యవసాయశాఖలో మినిస్టీరియల్ స్టాఫ్ సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం విజయవాడ ఎన్జీవో హోమ్‌లో సంఘ కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఇక్బాల్ అధ్యక్షతన జరిగింది. ట్రేసర్, డ్రాఫ్ట్స్‌మెన్ తదితర పోస్టులకు బదులుగా కొత్తగా సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అడ్మినిస్ర్టేషన్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేయాలని సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.