Shocking ఆ ఎంఈవో ఆఫీసులో జాతీయ జెండా ఎగురలేదు సరికదా.. కనీసం..

ABN , First Publish Date - 2022-08-16T13:54:55+05:30 IST

దేశవ్యాప్తంగా సోమవారం వాడ వాడవాడలా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు (Independenceday Celebrations) ఘనంగా జరిగాయి

Shocking ఆ ఎంఈవో ఆఫీసులో జాతీయ జెండా ఎగురలేదు సరికదా.. కనీసం..

Eluru : దేశవ్యాప్తంగా సోమవారం వాడ వాడవాడలా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు (Independenceday Celebrations) ఘనంగా జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Central and State Governments) సైతం ప్రతి ఇంటిపై జాతీయ జెండా(National Flag) ఎగరవేయాలని పిలుపునిచ్చాయి. భావి భారత పౌరులను తీర్చిదిద్ది, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుల కేంద్రమైన ఎంఈఓ కార్యాలయం(MEO Office)లో మాత్రం జెండా ఎగరవేయలేదు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల ఎంఈఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపలేదు సరికదా... కనీసం కార్యాలయం తలుపులకు తాళాలు కూడా తీయలేదు. వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడుతుంటే... ఎంఈఓ కార్యాలయ ప్రాంగణం ఎవరూ రాక బోసిపోయింది. స్వాతంత్ర దినోత్సవం రోజున కనీసం కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయాలని ఎంఈఓకి ఆలోచన లేకపోవడం, వారి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది.

Read more