ఇద్దరు బిడ్డలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-12T08:54:24+05:30 IST

చిత్తూరు జిల్లా వి.కోట మండలం జవ్వునిపల్లెకు చెందిన మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రామతీర్థానికి చెందిన శీనప్ప కుమార్తె అరుణకు..

ఇద్దరు బిడ్డలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

వి.కోట, అక్టోబరు 11: చిత్తూరు జిల్లా వి.కోట మండలం జవ్వునిపల్లెకు చెందిన మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.  రామతీర్థానికి చెందిన శీనప్ప కుమార్తె అరుణకు.. జవ్వునిపల్లెకు చెందిన  వెంకటరమణతో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సోమవారం అరుణ(30)ను భర్త వెంకటరమణ మందలించడంతో కలత చెందిన ఆమె తన ఇద్దరు బిడ్డలు  హరీష్‌(10), జతిన్‌(7)ను బావిలోకి తోసి, తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఇంటి నుంచి పొలం వద్దకు తన ఇద్దరు బిడ్డలతో వెళ్లిన అరుణ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు అనుమానంతో బావి వద్దకు వెళ్లగా చెప్పులు, ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో బావిలో గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. సీఐ ప్రసాద్‌బాబు, ఎస్‌ఐ రాంభూపాల్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని తల్లీబిడ్డల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ బిడ్డను అత్తింటి వారే వేధింపులతో అంతమొందించారని అరుణ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  

Read more