అంతర్రాష్ట్ర రోడ్డుపై గజరాజుల సందడి
ABN , First Publish Date - 2022-12-15T03:13:55+05:30 IST
చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి తమిళనాడు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం ఉదయం గజరాజులు సందడి చేశాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి తమిళనాడు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం ఉదయం గజరాజులు సందడి చేశాయి. ముసలి మడుగు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి రోడ్డుపైకి సుమారు 12 ఏనుగు లు వచ్చాయి. కొద్దిసేపు రహదారిపైనే అటు ఇటు తిరిగిన ఏనుగులు తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగుల మందను చూసిన వాహనదారులు దూరంగా ఉండిపోయారు.