ఫుల్‌గా మందుకొట్టి ఇంటికొచ్చిన దంపతులు.. కూతురని కూడా చూడకుండా రోజూ భార్య సహకారంతో..

ABN , First Publish Date - 2022-10-01T02:24:23+05:30 IST

అభం శుభం తెలియని కూతురిపై తరచూ అత్యాచారానికి పాల్పడే తండ్రి.. దీనికి సహకరించిన తల్లికి బతికినంత కాలం జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు

ఫుల్‌గా మందుకొట్టి ఇంటికొచ్చిన దంపతులు.. కూతురని కూడా చూడకుండా రోజూ భార్య సహకారంతో..

చిత్తూరు: అభం శుభం తెలియని కూతురిపై తరచూ అత్యాచారానికి పాల్పడే తండ్రి.. దీనికి సహకరించిన తల్లికి బతికినంత కాలం జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు ఆరో అదనపు జిల్లా కోర్టు, పోక్సో కోర్టు న్యాయమూర్తి శాంతి శుక్రవారం సంచలన తీర్పునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ పరిధిలోని ఓ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వీరు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. భార్యాభర్తలకు మద్యం తాగే అలవాటు ఉంది. 2018 నవంబరు 3వతేదిన వీరిద్దరూ పీకల దాక మద్యం తాగి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో పెద్ద కుమార్తె(13)పై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.


అతడికి భార్య కూడా సహకరిస్తూ ఉండేది. ఈ బాధను భరించలేక ఆ బాలిక తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి డీఎస్పీ రామకుమార్‌ విచారణ చేపట్టి బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసు వాదోపవాదాలు విన్న ఆరో అదనపు జిల్లా కోర్టు, పోక్సో కోర్టు న్యాయమూర్తి శాంతి.. నేరం రుజువు కావడంతో వారిద్దరికీ బతికున్నంత కాలం జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. బాధిత బాలికకు ప్రభుత్వం ద్వారా రూ.3 లక్షల నష్ట పరిహారం 30 రోజుల్లో చెల్లించేలా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కేసును ఏపీపీ లీలావతి వాదించారు. కసాయి తల్లితండ్రులకు శిక్ష పడేలా కేసును వాదించిన ఏపీపీ లీలావతిని పలువురు న్యాయవాదులు అభినందించారు.

Read more