ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుర్మార్గం : రాంగోపాల్ రెడ్డి

ABN , First Publish Date - 2022-12-31T19:39:37+05:30 IST

Amaravathi: వైసీపీ (YCP) ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి (Chenna Keshava Reddy) వ్యాఖ్యలు దుర్మార్గమని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుర్మార్గం : రాంగోపాల్ రెడ్డి

Amaravathi: వైసీపీ (YCP) ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి (Chenna Keshava Reddy) వ్యాఖ్యలు దుర్మార్గమని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే సీఎం జగన్‌(CM Jagan)కు, వైసీపీ నేతలకు అలుసయి పోయిందన్నారు. వీఆర్వో, వీఏవోలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతుందని వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడటం సమంజసం కాదని పేర్కొన్నారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ ఆ హామీ నెలబెట్టుకోకపోగా .. ఉద్యోగులపై కక్ష్యసాధింపు ధోరణి అవలంభించడం దారుణమన్నారు.

Updated Date - 2022-12-31T19:40:31+05:30 IST

Read more