ఏపీలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ కాలేదు, దురుద్దేశంతోనే కుట్రలు: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-04-29T03:55:56+05:30 IST

ఏపీలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ కాలేదు, దురుద్దేశంతోనే కుట్రలు: మంత్రి బొత్స

ఏపీలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ కాలేదు, దురుద్దేశంతోనే కుట్రలు: మంత్రి బొత్స

అమరావతి: ఏపీలో ఎక్కడా టెన్త్‌ పేపర్‌ లీక్‌ కాలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దురుద్దేశంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఉదయం 9:30 గంటల కంటే ముందుగా పేపర్ బయటకొస్తే లీక్‌గా భావిస్తారని, నంద్యాలలో పేపర్ లీక్ అంటూ కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. కుట్రకు పాల్పడిన వారిపైనా, టీచర్లపైనా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స అన్నారు. కుట్ర చేసిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశామని, వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్, సుధాకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని బొత్స తెలిపారు. ప్రభుత్వం తరపున మాల్ ప్రాక్టీస్‌, లీక్ వంటివి జరగలేదని చెప్పారు. అలా జరగాలని ప్రయత్నించిన కుట్రను భగ్నం చేశామని, పరీక్షలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఎక్కడా లీకులు కానీ.. మాల్ ప్రాక్టీస్ కానీ జరగలేదని, వార్డ్‌బాయ్‌గా తొమ్మిదో తరగతి అబ్బాయిని పెట్టడం తప్పే.. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స వెల్లడించారు.

Updated Date - 2022-04-29T03:55:56+05:30 IST