మాజీ మంత్రి Kodali nani ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-07-15T18:37:18+05:30 IST

మాజీ మంత్రి కొడాలి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మాజీ మంత్రి Kodali nani ఇంటి వద్ద ఉద్రిక్తత

విజయవాడ: మాజీ మంత్రి కొడాలి నాని(Kodali nani) ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి జనసేన(Janasena) పార్టీ శ్రేణులు యత్నించారు. కాగా... జనసేన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు యత్నించగా... తామేం నేరం చేశామంటూ కార్యకర్తలు ఎదురు తిరిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. గోతులమయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మొద్దు నిద్రపోతున్న సీఎం మేలుకోవాలంటూ ఫ్లకార్డులతో  నినాదాలు చేశారు. కొడాలి నాని, పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు నేర్పడం మాని అధ్వానంగ ఉన్న గుడివాడ రోడ్లకు మరమ్మతులు చేయించాలని జనసేన పార్టీ నేతలు హితవుపలికారు. 

Read more