AP News: అనంత మురడి ఆంజనేయస్వామి ఆలయంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-09-06T19:32:04+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం మురడి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

AP News: అనంత మురడి ఆంజనేయస్వామి ఆలయంలో ఉద్రిక్తత

అనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం మురడి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ రాణా ప్రతాప్, పోలీసుల సమక్షంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. దేవాలయానికి వచ్చే మహిళలను లోబర్చుకుని అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ ఉండడంతో ఆలయ ప్రధాన అర్చకుడు అనంతసేనను అధికారులు తొలగించారు. వేధింపులకు గురి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ అనంతసేనపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఈ వివాదం కొనసాగుతుండగానే అనంతసేన కుటుంబ సభ్యులకు అర్చకత్వం అప్పగించేందుకు అధికారులు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న మురడి గ్రామస్తులు ఆలయం వద్దకు భారీగా చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనంతసేన కుటుంబ సభ్యులకు దేవాలయం బాధ్యతలు అప్పగించకూడదంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-09-06T19:32:04+05:30 IST