-
-
Home » Andhra Pradesh » Telugu youth and TNSF try to besiege assembly andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
AP News: నలువైపుల నుంచి అసెంబ్లీ ముట్టడికి తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ యత్నం
ABN , First Publish Date - 2022-09-15T16:05:17+05:30 IST
తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నించడటంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అమరావతి: తెలుగు యువత (Telugua yuvatha), టీఎన్ఎస్ఎఫ్ (TNSF) శ్రేణులు ఏపీ అసెంబ్లీ (AP Assembly)ని ముట్టడించేందుకు యత్నించడటంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నలువైపుల నుంచి అసెంబ్లీ ముట్టడికి ఆందోళనకారులు యత్నించారు. పొలాల్లో నుంచి అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ తెలుగు యువత శ్రేణులు చొచ్చుకొచ్చారు. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా ముట్టడికి వస్తున్న శ్రేణుల్ని అదుపు చేసేందుకు పోలీసుల ముప్పుతిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెలుగు యువత శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
అలాగే ఆర్టీసీ బస్సులో వచ్చిన పలువురు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీ గేటును తాకిన టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను పోలీసులు కిందపడేశారు. వారిని బలవంతంగా అక్కడి నుంచి వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.