టీచర్లకు పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వాలి: ఆప్తా
ABN , First Publish Date - 2022-12-13T03:34:25+05:30 IST
గతేడాది బదిలీ అయి, ఇప్పుడు రేషనలైజేషన్‌కు గురైన ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్లు కేటాయించాలని ఏపీ ప్రాఽథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్తా) ప్రభుత్వాన్ని కోరింది.
గతేడాది బదిలీ అయి, ఇప్పుడు రేషనలైజేషన్‌కు గురైన ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్లు కేటాయించాలని ఏపీ ప్రాఽథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్తా) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్లు ఎవరూ డీఈవో పూల్‌లో లేకుండా బదిలీలు చేపట్టాలని, దివ్యాంగులకు కేటాయించిన ప్రాధాన్యతా పాయింట్ల విషయంలో శాతాల్లో వ్యత్యాసం ఉన్నందున సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలని కోరింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు, కె.ప్రకాశ్‌రావు ఈమేరకు సోమవారం విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు.