AP News: విశాఖ టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-07-31T19:39:55+05:30 IST
విశాఖ టీడీపీ (TDP) కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకురాలు వంగలపూడి అనితను పోలీసులు అడ్డుకున్నారు.

విశాఖ: విశాఖ టీడీపీ (TDP) కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకురాలు వంగలపూడి అనితను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి అమర్నాథ్‌ను అడ్డుకునేందుకు అనిత నోవాటెల్ బయల్దేరారు. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ మహిళా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి అమర్నాథ్‌ను కలవడానికి వెళ్లనివ్వాలని టీడీపీ శ్రేణుల డిమాండ్ చేశాయి. వైసీపీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదని ఆదివారం మంత్రి చెప్పారు. దీంతో వైసీపీ మేనిఫెస్టోను లైవ్‌లో వంగలపూడి అనిత తగలబెట్టారు.