AP News: టీడీపీ ఖర్చు పెట్టింది 44వేల 829 కోట్లు.. వైసీపీది కేవలం 7 వేల 763 కోట్లు మాత్రమే
ABN , First Publish Date - 2022-10-18T01:13:29+05:30 IST
అమరావతి: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గత టీడీపీ పాలనలో, ఇప్పటి వైసీపీ పాలనలో నీటి పారుదల రంగా
అమరావతి: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గత టీడీపీ పాలనలో, ఇప్పటి వైసీపీ పాలనలో నీటి పారుదల రంగానికి ఖర్చు చేసిన వ్యయాన్ని ప్రస్తావించారు. టీడీపీ హయాంలో ఐదు సంవత్సరాల్లో నీటిపారుదల రంగం పై రూ. 44 వేల 829 కోట్ల ఖర్చు చేయగా.. ప్రస్తుత జగన్ ప్రభుత్వం మూడేళ్లలో రూ. 7 వేల 763 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. మిగతా రెండు సంవత్సరాల్లో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రతినెల అష్టకష్టాలు పడుతున్న జగన్ ఇక సాగునీటి ప్రాజక్ట్ల కోసం ఏం ఖర్చు పెడతారని ప్రశ్నించారు.