జగన్‌రెడ్డీ దమ్ముందా?
ABN , First Publish Date - 2022-05-15T08:28:29+05:30 IST
జగన్‌రెడ్డీ దమ్ముందా?
మాజీ మంత్రి అనిల్ అక్రమ లే అవుట్ వేశారు
దానిని ధ్వంసం చెయ్యి: లోకేశ్
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్‌రెడ్డీ... నీకు దమ్ముంటే మాజీ మంత్రి అనిల్ అక్రమ లే అవుట్‌ను ఽధ్వంసం చెయ్యి’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సవాల్ చేశారు. ఆయన శనివారం ఒక ప్రకటన చేశారు. ‘‘ఆంధ్రలో అరాచకం, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సైకో జగన్‌రెడ్డి కేబినెట్లో మాజీలైన మంత్రుల దోపిడీ బయటపడుతోంది. బూతులు, జిప్పు తీయడంలు తప్ప సాగునీటిపరంగా ఆంధ్రకు పైసా ప్రయోజనం చేయలేని దద్దమ్మ మంత్రిగా నిలిచిపోయిన అనిల్... తన మంత్రి పదవి ద్వారా దోచుకున్న రూ.కోట్లతో నెల్లూరు సిటీలో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ నగర్ పక్కన జాతీయ రహదారిని ఆనుకుని అనిల్, వైసీపీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ బినామీగా రూ.50 కోట్ల అక్రమ లే అవుట్ సిద్ధమైంది. సీఎం నియంత్రణలో ఉన్న నెల్లూరు అర్బన్ డెవల్‌పమెంట్ అఽథారిటీ ద్వారా మాజీ మంత్రి అనిల్, కిన్నెర ప్రసాద్‌లపై కేసులు పెట్టించాలి. ’’ అని లోకేశ్ పేర్కొన్నారు. కాగా, ‘ సొంత పార్టీ అరాచకాలను, అవినీతిని తనదైన శైలిలో ఎండగడుతున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవాలు బయటపెడుతున్నారనే కక్షతో సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా చిత్రహింసలకు గురిచేసి జగన్‌రెడ్డి వికృతానందం పొందింది కూడా గతేడాది ఇదే రోజు’ అని లోకేశ్ పేర్కొన్నారు.