ధన్‌కర్‌కు టీడీపీ ఎంపీల మద్దతు
ABN , First Publish Date - 2022-08-04T09:09:00+05:30 IST
ధన్‌కర్‌కు టీడీపీ ఎంపీల మద్దతు
న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు తెలుగు దేశం పార్టీ మద్దతు తెలిపింది. బుధవారం ఢిల్లీలో జగదీప్ ధన్‌కర్‌ను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్ కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీలు ఆయనను సన్మానించారు.