వైసీపీ పాలనపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే గళం విప్పుతున్నారు: TDP MLA
ABN , First Publish Date - 2022-06-30T20:49:47+05:30 IST
వైసీపీ పరిపాలన ఎలా ఉందో వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

ప్రకాశం: వైసీపీ (YCP) పరిపాలన ఎలా ఉందో వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్(Gottipati ravikumar) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఎక్కడా ప్రజలకు సంబంధించిన పనులు జరగడం లేదని విమర్శించారు. నాలుగైదు రూపాయలు డబ్బులు వేయడం తప్ప ఎక్కడా గుంటలు కూడా పూడ్చలేదని విమర్శించారు. ముఖ్య మంత్రి సహాయ నిధి, ఆరోగ్య శ్రీ లేవన్నారు. ప్రజలు అభద్రతా భావంతో బతుకుతున్నారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లినప్పుడు జనం నిలదీస్తున్నారని... ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలే గళం విప్పుతున్నారన్నారు. రోబోయే రోజుల్లో ప్రజలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని రవికుమార్ అన్నారు.