Gorantla madhav డర్టీ పిక్చర్ వీడియో ఒరిజినలే: పట్టాభి
ABN , First Publish Date - 2022-08-13T19:16:48+05:30 IST
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla madhav) డర్టీ పిక్చర్ వీడియో నిజమని అమెరికా ఫోరెన్సిక్ (America Forensic) ధృవీకరించిందని టీడీపీ నేత పట్టాభి (Pattabhi) తెలిపారు.

అమరావతి: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla madhav) డర్టీ పిక్చర్ వీడియో నిజమని అమెరికా ఫోరెన్సిక్ (America Forensic) ధృవీకరించిందని టీడీపీ నేత పట్టాభి (Pattabhi) తెలిపారు. ఈ వార్త చివరిలో ఆ రిపోర్ట్ చూడవచ్చు. పట్టాభి శనివారం మీడియాతో మాట్లాడుతూ... మార్ఫింగ్, ఎడిటింగ్ లాంటివి ఏమీ జరగలేదని నివేదికలో ఉన్నట్లు చెప్పారు. ‘‘వాట్ మిస్టర్ జగన్‌రెడ్డి (Jagan reddy).. ఇది సరిపోతుందా మీకు. మీ ఎంపీపై చర్య తీసుకోవడానికి ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా’’ అని ప్రశ్నించారు. ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే మాధవ్(YCP MP)కు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ప్రశ్నించారు. ఎంపీ మాధవ్‌ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైసీపీ పార్టీలోని కామపిశాచాలను ఎంతకాలం కాపాడుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలు పోలీసులను అడ్డంపెట్టుకుని వారి తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని పట్టాభి అన్నారు. ఎంపీ మాధవ్‌పై జగన్ (CM Jagan) చర్యలు తీసుకోరని తమకు తెలుసన్నారు. అందుకే అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వీడియో టెస్ట్ చేయించినట్లు తెలిపారు. పిట్టకథలు చెబుతున్న సజ్జల (Sajjala ramakrishna reddy) దీనికేం మాట్లాడతారని నిలదీశారు. అనంతపురంలో మాధవ్ సిగ్గులేకుండా హోర్డింగ్‌లు పెట్టించుకున్నారన్నారు. మాధవ్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. టీడీపీ (TDP), మీడియాపై మాధవ్ ఏంది సవాల్ చేసేది అంటూ పట్టాభి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.