చంద్రబాబు పర్యటనతో వైసీపీ నేతల్లో భయం: Panabaka laxmi

ABN , First Publish Date - 2022-07-07T20:09:51+05:30 IST

రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత పనబాకలక్ష్మి అన్నారు.

చంద్రబాబు పర్యటనతో వైసీపీ నేతల్లో భయం: Panabaka laxmi

తిరుపతి: రాయలసీమలో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పర్యటనతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత పనబాకలక్ష్మి (Panabaka laxmi)అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... తిరుపతిలో 30 యాక్ట్ అమలుకు వైసీపీ (YCP) నేతల ఒత్తిడే కారణమని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత పర్యటన సమయంలో ఆంక్షలు పెట్టడమేంటి అని ప్రశ్నించారు. మదనపల్లె సభ జనసంద్రంగా మారిందన్నారు. అడుగడుగునా చంద్రబాబుకు జనం నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేస్తామని... కేసులకు భయపడమని పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు. 

Read more