నా వెంట్రుక పీకలేరంటూ పిల్లల ముందు బిల్డప్ ఎందుకు?: Lokesh
ABN , First Publish Date - 2022-06-30T14:47:28+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విరుచుకుపడ్డారు.

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokes) విరుచుకుపడ్డారు. ‘‘మీడియాను చూస్తే భయం, సోషల్ మీడియా అంటే వణుకు, చివరికి యూట్యూబ్ ఛానెల్ థంబ్ నైల్ చూసి జడుసుకునే జగన్ రెడ్డి సింగిల్ గా వచ్చే సింహమా! వీధి కుక్క కూడా కాదు. ఈ మాదిరి పిరికోడికి నా వెంట్రుక పీకలేరంటూ పిల్లల ముందు బిల్డప్ ఎందుకు?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కనీసం ఐడెంటిటీ లేకుండా అర్ధరాత్రి దొంగల్లా గోడ దూకడం, గునపాలతో తలుపులు పగలగొట్టిన కొంతమంది పోలీసులు వైసీపీ గూండాలను మించిపోయారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామవాసి, టీడీపీ కార్యకర్త, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు వెంకటేష్ ఇంట్లోకి చొరబడి దాడి చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కనపడకుండా ఉండటానికి లైట్లు పగలగొట్టినా తమ మొఖాలన్నీ స్పష్టంగా వీడియోలో రికార్డ్ అయ్యాయయన్నారు. జగన్ రెడ్డి ప్రాపకం కోసం చట్టాన్ని అతిక్రమించి అడ్డదారులు తొక్కుతున్న వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ హెచ్చరించారు.