మహానుభావులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం: Devathoti

ABN , First Publish Date - 2022-01-03T15:03:19+05:30 IST

రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాల ధ్వంసంపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహానుభావులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం: Devathoti

అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు జరుగుతున్న అవమానాలపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విగ్రహానికి, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ విగ్రహాలకు అవమానం జరగడం... మొత్తం ఏపీ ప్రజలకు జరిగిన అవమానే అని అన్నారు. ఒకవైపు అంబేద్కర్ విగ్రహం పక్కన వేరే విగ్రహం ఏర్పాటు పేరుతో, మరోవైపు ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంతో వైసీపీ ప్రభుత్వం వారి ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తోందని వ్యాఖ్యానించారు. విగ్రహాల రాజకీయాలను మార్చుకోకపోతే వైసీపీ ప్రభుత్వం శాశ్వతంగా శిథిలం కాక తప్పదన్నారు. వైసీపీ ప్రభుత్వం మహానుభావులను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని దేవతోటి నాగరాజు  హెచ్చరించారు.

Read more