మంత్రి కారుమూరికి అయ్యన్న కౌంటర్
ABN , First Publish Date - 2022-04-30T19:34:53+05:30 IST
మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ‘‘గొడ్డలి పోటుని గుండె పోటు చేసి కెమెరాల ముందు ఏడవటం.. హత్య చేయించి పరామర్శకు వెళ్ళడం టిడిపి నేతలకు చేత కాదు కారుమూరి నాగేశ్వరరావు గారు. తన తాళి తెంపింది ఎమ్మెల్యే తలారి వెంకట రావే అని మృతుడి భార్య విలపిస్తుంది. ఎమ్మెల్యేకి సన్మానం అయ్యింది. మీకు సరదాగా ఉంటే అదే గ్రామం వెళ్లి మాపై ఆరోపణలు చెయ్యాలని మనవి’’ అంటూ అయ్యన్న పాత్రుడు యెద్దేవా చేశారు.