పోలీసులతో కాదు.. ఇతర సంస్థలతో విచారించాలి!

ABN , First Publish Date - 2022-12-31T05:33:10+05:30 IST

‘‘కందుకూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 8 మంది మృతి చెందడం దురదృష్టకరం.

పోలీసులతో కాదు.. ఇతర సంస్థలతో విచారించాలి!

పోలీసులతో కాదు.. ఇతర సంస్థలతో విచారించాలి!

జరిగిన ఘటనను రాజకీయం చేయొద్దు: టీడీపీ

కందుకూరు, డిసెంబరు 30: ‘‘కందుకూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 8 మంది మృతి చెందడం దురదృష్టకరం. అయితే దీనిని రాజకీయం చేసి టీడీపీపై బురదజల్లాలని వైసీపీ నేతలు, ప్రభుత్వం చేస్తున్న చౌకబారు రాజకీయాలు నీచం’’ అని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం విమర్శించారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ దుర్ఘటనపై విచారణను మేం స్వాగతిస్తాం. అయితే పోలీసులతో కాకుండా ఇతర సంస్థలతో విచారణ జరపాలి. చంద్రబాబు రోడ్‌ షోకు, బహిరంగ సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు తగిన భద్రతాచర్యలు చేపట్టాల్సిన అవసరం లేదా!? కందుకూరు మండలం శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన వంకదారి పిచ్చయ్య ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన వద్దకు లింగసముద్రం ఎస్‌ఐ వెళ్లి తెల్లకాగితంపై వేలిముద్ర వేయించుకుని వచ్చారు. తీరా ఆయన ఫిర్యాదు ఇచ్చినట్లు కేసు నమోదు చేస్తున్నట్లు చెబుతున్నారు’’ అని ఆరోపించారు.

Updated Date - 2022-12-31T05:33:10+05:30 IST

Read more