గంటాకు టీడీపీ అధిష్టానం పిలుపు

ABN , First Publish Date - 2022-02-18T01:36:25+05:30 IST

టీడీపీ ఇన్‌చార్జ్‌లు, పలువురు ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది. మొత్తం 12 మందిని శుక్రవారం సమావేశానికి రావాలని

గంటాకు టీడీపీ అధిష్టానం పిలుపు

అమరావతి: టీడీపీ ఇన్‌చార్జ్‌లు, పలువురు ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది. మొత్తం 12 మందిని శుక్రవారం సమావేశానికి రావాలని టీడీపీ అధిష్టానం కోరింది. విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా రావాలని అధిష్టానం ఆదేశించింది. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో గంటా శ్రీనివాసరావు క్రియాశీలకంగా లేరు. అయితే ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. రేపు చంద్రబాబును కలుస్తానని గంటా చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


ఇటీవల గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారని, సీఎం జగన్‌ ఇందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. 2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి విశాఖ నార్త్‌ నుంచి  పోటీ చేసి గెలిచారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. ప్రస్తుతం రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది. 

Read more