మహిళలకు జగన్ అండగా ఉన్నారని టీడీపీ ఫ్రస్ట్రేషన్: హోంమంత్రి వనిత
ABN , First Publish Date - 2022-04-27T01:50:56+05:30 IST
మహిళలకు జగన్ అండగా ఉన్నారని టీడీపీ ఫ్రస్ట్రేషన్: హోంమంత్రి వనిత

తూర్పుగోదావరి: అత్యాచార బాధితురాలి పరామర్శను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాజకీయం చేశారని హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. 3 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని హోంమంత్రి తెలిపారు. మహిళలకు జగన్ అండగా ఉన్నారని టీడీపీ ఫ్రస్ట్రేషన్లో ఉందని ఆమె అన్నారు. గత ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు జరిగితే బయటకు వచ్చేవి కావని, మా ప్రభుత్వంపై నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారని తానేటి వనిత చెప్పారు. అందుకే మా ప్రబుత్వంలో అత్యాచార కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందని వనిత వెల్లడించారు.