డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2022-05-24T18:37:37+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మంగళవారం భేటీ అయ్యారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ భేటీ

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్(Ananta uday bhaskar) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ (TDP factfinding committee) సభ్యులు మంగళవారం భేటీ అయ్యారు. అనంతబాబు అరెస్ట్ అనంతర పరిణామాలపై చర్చించనున్నారు. అనంత ఉదయ్ భాస్కర్‌ను ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలని టీడీపీ నిజానిర్ధారణ కమిటీ డిమాండ్ చేస్తోంది. గవర్నర్‌ను కలిసి ఒక నివేదిక అందచేయాలని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్‌ను కలిసేందుకు టీడీపీ బృందం సమయం కోరింది. 

Read more