TDP counter: మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ గర్జనకు టీడీపీ కౌంటర్

ABN , First Publish Date - 2022-10-12T14:40:42+05:30 IST

మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ గర్జన (YCP Roar)కు తెలుగుదేశం పార్టీ కౌంటర్ (TDP counter) ఇచ్చింది.

TDP counter: మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ గర్జనకు టీడీపీ కౌంటర్

అమరావతి (Amaravathi): మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ గర్జన (YCP Roar)కు తెలుగుదేశం పార్టీ కౌంటర్ (TDP counter) ఇచ్చింది. ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల టీడీపీ నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. అమరావతి రాజధానిగా టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. విశాఖపట్టణాన్ని ఇప్పటికే ఐటీ, పారి శ్రామికంగా తెలుగుదేశం తీర్చిదిద్దిన విషయాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. మూడు జిల్లాల్లోని టీడీపీ నియోజకవర్గాల ఇన్చార్జులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ జడ్పీ చైర్మన్‌లు, ఎంపీ అభ్యర్థులు, ఇతర పార్టీ ముఖ్యులు హాజరుకావాలని సమాచారమిచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా విశాఖపట్నానికి తెచ్చిన  పరిశ్రమలు అభివృద్ధి చేసిన వైనాన్ని ఈ సమావేశం ద్వారా ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.

Updated Date - 2022-10-12T14:40:42+05:30 IST