సీఎం జగన్పై సయ్యద్ రఫీ ఫైర్
ABN , First Publish Date - 2022-06-19T23:57:11+05:30 IST
మద్యపాన నిషేదంపై మాట తప్పిన జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండే అర్హత లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు.

విజయవాడ: మద్యపాన నిషేదంపై మాట తప్పిన జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండే అర్హత లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. ఆదాయం,అప్పుల కోసం మద్యం అమ్మకాలు పెంచి మహిళల మాంగల్యాలు తెంచుతారా?, మద్యంపై వచ్చే 15 ఏళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పులు తెచ్చింది వాస్తవం కాదా?, ఎన్నికల ముందు మద్యపాన నిషేదం చేస్తానని అధికారంలోకి వచ్చాక జగన్ మాట తప్పింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ రెడ్డి ధన దాహానికి పచ్చని కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల తాళిబొట్టు తెంచుతూ వేల కోట్ల వెనకేసుకోవడం దుర్మార్గమన్నారు. టీచర్ల చేత మద్యం అమ్మించిన ఘటన జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటున్న వ్యక్తి భారతదేశంలో జగన్ ఒక్కడే అని విమర్శించారు. టీడీపీ పాలనలో మద్యం అమ్మకాలపై విష ప్రచారం చేసిన మంత్రి రోజా ఇప్పుడు ఏ కలుగులో దాక్కుంది?, మద్యపాన నిషేదం చేశాకే 2024 ఎన్నికలకు వెళతామనన్న మంత్రి విడదల రజనీ ఏం సమాధానం చెప్తారు? అని ఆయన ప్రశ్నించారు.