ఈరోజు మధ్యాహ్నం టీడీఎల్పీ భేటీ

ABN , First Publish Date - 2022-03-05T15:33:40+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం జరుగనుంది.

ఈరోజు మధ్యాహ్నం టీడీఎల్పీ భేటీ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై శాసనసభ పక్షం తుది నిర్ణయం తీసుకోనుంది. చట్ట సభలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. గత సమావేశాల్లో జరిగిన అవమానానికి కలత చెంది అసెంబ్లీ సమావేశాలను  చంద్రబాబు బాహిష్కరించిన విషయం తెలిసిందే. చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరుపై పార్టీలో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం జుమ్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగే భేటీలో  టీడీఎల్పీ తుది నిర్ణయం తీసుకోనుంది. సోమవారం నుంచి  బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకావాల్సి ఉంది. సభకు హాజరుకాని పక్షంలో ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై చంద్రబాబు టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.  

Read more