మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం

ABN , First Publish Date - 2022-07-26T22:11:10+05:30 IST

మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం ఎదురయింది. వనిత సొంత నియోజకవర్గం కొవ్వూరు అర్బన్ బ్యాంక్‌ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది.

మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం

తూర్పుగోదావరి: మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం ఎదురయింది. వనిత సొంత నియోజకవర్గం కొవ్వూరు అర్బన్ బ్యాంక్‌ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అసలు పోటీలో వైసీపీ అభ్యర్థులు కనిపించలేదు. 11 డైరెక్టర్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. టీడీపీ నేత మద్దిపట్ల శివరామకృష్ణను ప్రెసిడెంట్‌గా డైరెక్టర్లు ఎన్నుకున్నారు. వరుసగా ఐదోసారి బ్యాంక్ చైర్మన్‌గా శివరామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. టీడీపీని ఓడించాలని ముందుగానే వైసీపీ శ్రేణులకు హోంమంత్రి సూచించారు. త్రీమాన్ కమిటీ ద్వారా ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళిక కూడా కలిగివున్నారు. టీడీపీ గెలుపుతో వైసీపీ నేతలపై మంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొవ్వూరు అర్బన్ ఎన్నికల వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. కొవ్వూరు అర్బన్ బ్యాంక్‌కు చేరుకున్న జిల్లా రిజిస్ట్రార్ విచారణ చేపట్టారు. 


Read more