Tadipatriలో వైసీపీ అరాచకం
ABN , First Publish Date - 2022-06-12T00:20:52+05:30 IST
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులపై దాడికి పాల్పడ్డారు

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తాడిపత్రి (Tadipatri)లో శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పలు వాహనాల్లో 20 నుంచి 30 మంది అనుచరులతో తాడిపత్రి పట్టణ సమీపంలోని సీపీఐ కాలనీ (CPI Colony) వద్ద హల్చల్ చేశారు. కాలనీ సమీపంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి చెందిన ఎస్టీపీ-1లో జరుగుతున్న పైపులైన్ పనులను అడ్డుకున్నారు. అక్కడున్న టీడీపీ కౌన్సిల్ సభ్యులపై దాడికి దిగారు. ఈ దాడిలో 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జునకు గాయాలయ్యాయి. మల్లికార్జున పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.