రాజ్యసభ సభ్యులుగా వైసీపీ, టీఆర్ఎస్ సభ్యుల ప్రమాణస్వీకారం
ABN , First Publish Date - 2022-06-24T16:18:32+05:30 IST
రాజ్యసభ సభ్యులుగా వైసీపీ, టీఆర్ఎస్ సభ్యులు శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు.

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులుగా వైసీపీ, టీఆర్ఎస్ సభ్యులు శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. వైసీపీ నుంచి ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah), ఎస్.నిరంజన్‌రెడ్డి (S.Niranjan Reddy) రాజ్యసభకు ఎన్నికవగా, టీఆర్ఎస్ నుంచి దామోదరరావు(Damodar Rao), పార్థసారథిరెడ్డి(Parthasarathy Reddy) పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఈరోజు ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభ్యులచేత ప్రమాణస్వీకారం చేయించారు.