హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టేకు సుప్రీం నో..
ABN , First Publish Date - 2022-11-28T13:23:39+05:30 IST
అమరావతి కేసులో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నేడు అమరావతి కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు.
Delhi : అమరావతి కేసు (Amaravathi case)లో ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)కు సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. నేడు అమరావతి కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు అయ్యేలా చూడాలని రైతులు కోరారు. కాగా.. హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాజధానిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే సుప్రీం స్టే విధించింది. రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీం నిరాకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.