ఆదిత్యుడ్ని తాకిన సూర్యకిరణాలు
ABN , First Publish Date - 2022-03-11T00:23:50+05:30 IST
ఆరోగ్యప్రధాత.. ప్రత్యక్షదైవం.. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన ఆదిత్యుడ్ని గురువారం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6 గంటల సమయంలో ఆదిత్యుడు మూలవిరాట్‌ను స్పృశించాయి.
అరసవల్లి: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన ఆదిత్యుడ్ని గురువారం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6 గంటల సమయంలో ఆదిత్యుడు మూలవిరాట్‌ను స్పృశించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన ఆదిత్యుడ్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు.