Nellore: 10వ తరగతి పరీక్షా హాల్ టికెట్లో సబ్జెక్టులు తారుమారు
ABN , First Publish Date - 2022-04-29T16:05:43+05:30 IST
జిల్లాలోని ఆత్మకూరులో పదవతరగతి పరీక్షా హాల్ టికెట్లో సబ్జెక్టులు తారుమారయ్యాయి.

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరులో పదవతరగతి పరీక్షా హాల్ టికెట్లో సబ్జెక్టులు తారుమారయ్యాయి. ఓ విద్యార్థికి తెలుగు పరీక్ష రోజు స్పెషల్ హిందీ, హిందీ పరీక్ష రోజున స్పెషల్ తెలుగు క్వశ్చన్ పేపర్‌ను ఇన్విజలేటర్లు ఇచ్చారు. ఇదే విషయాన్ని విద్యార్థి అడిగితే హాల్ టికెట్లో ఉన్న సబ్జెక్ట్ మాత్రమే క్వశ్చన్ పేపర్‌గా ఇచ్చామని ఇన్విజిలేటర్లు తెలిపారు. మోడెమ్ శివ కుమార్ అనే విద్యార్థి మర్రిపాడు మండలం డిసి పల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. సబ్జెక్టుల తారుమారుపై తనకు న్యాయం చేయాలని విద్యార్థి శివకుమార్ కోరుతున్నాడు. హెడ్ మాస్టర్ నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి తండ్రి బుజ్జయ్య ఆరోపించారు.