తల్లి గొంతుపై కాలుతో తొక్కి....

ABN , First Publish Date - 2022-09-27T07:43:01+05:30 IST

తల్లిని వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవలసిన కొడుకు మృగమయ్యాడు....డబ్బులు ఇవ్వలేదని మాతృమూర్తి గొంతుపై కాలుతో తొక్కి చంపేప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో

తల్లి గొంతుపై కాలుతో తొక్కి....

డబ్బులు ఇవ్వలేదని చిత్ర హింసలు పెట్టిన కొడుకు

వీడియో వైరల్‌ కావడంతో కటకటాల పాలు


కాజులూరు, సెప్టెంబరు 26: తల్లిని వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవలసిన కొడుకు మృగమయ్యాడు....డబ్బులు ఇవ్వలేదని మాతృమూర్తి గొంతుపై కాలుతో తొక్కి చంపేప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో కటకటాల పాలయ్యాడు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన లక్ష్మి కొద్దిరోజులుగా చిన్నకుమారుడైన వెంకన్న ఇంటివద్ద ఉంటోంది. ఐతే వెంకన్న తన తల్లిని డబ్బుల కోసం వేధిస్తున్నాడు. తన వద్ద డబ్బులు లేవని, పింఛను సొమ్ములు వచ్చిన తర్వాత ఇస్తానని చెబుతున్నా వినకుండా చిత్రహింసలు పెడుతున్నాడు. ఇటీవల మద్యంమత్తులో వెంకన్న ఇంటిబయట తన తల్లిని కిందపడేసి తొక్కుతున్న వైనం వీడియో రూపంలో బయటకు వచ్చి వైరల్‌ కావడంతో స్థానికులు ఆమెను యానాం ఆసుపత్రికి తరలించారు.


ఈ వీడియో గమనించిన కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు గొల్లపాలెం ఇన్‌చార్జ్‌ (పెదపూడి) ఎస్‌ఐ పి.వాసుని అప్రమత్తం చేశారు. ఎస్పీ ఆదేశాలతో ఎస్‌ఐ వాసు యానాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని పరామర్శించారు.  తల్లిపై దాడి చేసిన వెంకన్నను అరెస్టు చేశారు. 

Read more