-
-
Home » Andhra Pradesh » Start of work with crores-NGTS-AndhraPradesh
-
అమరావతిలో రూ.192 కోట్లతో పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2022-07-05T07:55:40+05:30 IST
అమరావతిలో రూ.192 కోట్లతో పనులు ప్రారంభం

తుళ్లూరు, జూలై 4: హైకోర్టు తీర్పునకు కట్టుబడి రాజధాని అమరావతిలో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతాయని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. సోమవారం రాజధాని గ్రామం దొండపాడు పరిధిలోని పిచుకలపాలెం రెవెన్యూలో రూ.192.52 కోట్లతో జోన్-4 అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ జోన్లో 63 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు, ఐఏఎస్, ఐపీఎ్సల భవనాల తుది దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 12 జోన్లలోని ఎల్పీఎస్ లే అవుట్లలోని రైతుల ప్ల్లాట్లను దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పనులు చేసుకుపోతామని తెలిపారు. భూమిలేని నిరుపేదలకు పింఛన్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఇవ్వాల్సి ఉందన్నారు. తొలుత మార్చినెల పింఛన్ విడుదల చేస్తామన్నారు. కొన్ని కోర్టులో పరిధిలో, మరికొన్ని టైటిల్స్ విషయం తేలాల్సి ఉన్నందున అసైన్డ్ రైతులకు కౌళ్లు జమ కాలేదన్నారు. సమస్యలు లేనివారికి కౌలు అందజేశామని చెప్పారు. కాగా, అసైన్డ్ రైతు పులి చిన్నా కమిషనర్ కాళ్లు పట్టుకునేందుకు యత్నించి తనకు కౌలు రావడం లేదని తెలిపారు.