ఈఏపీ సెట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-05T08:06:05+05:30 IST

ఈఏపీ సెట్‌ ప్రారంభం

ఈఏపీ సెట్‌ ప్రారంభం

తొలిరోజు 03.54 శాతం మంది హాజరు


అమరావతి, అనంతపురం సెంట్రల్‌, జూలై 4: ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌-2022 పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 41,607 మంది విద్యార్థులకుగాను 38,918 మం ది హాజరయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పరీక్షలకు 1,753 మంది రిజిస్టర్‌ చేసుకోగా 1,457 మంది హాజరయ్యారు. మొత్తం 93.54 శాతం హాజరు నమోదైంది. సెట్‌ నిర్వాహక కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రంగ జనార్దన పలు పరీ క్షా కేంద్రాలను తనిఖీ చేశారు. 8వ తేదీ వరకు ఇంజనీరింగ్‌, 11, 12 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. తెలంగాణ విద్యార్థులకోసం హైదరాబాద్‌లో ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 

Read more