Srikakulamలో మందుబాబుల వీరంగం

ABN , First Publish Date - 2022-02-19T15:54:44+05:30 IST

జిల్లాలోని రాజాం పట్టణంలో మందుబాబులు వీరంగం సృష్టించారు.

Srikakulamలో మందుబాబుల వీరంగం

శ్రీకాకుళం: జిల్లాలోని రాజాం పట్టణంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ హోటల్ వద్ద మద్యం సేవించి హంగామా చేశారు. హోటల్‌లో ఫర్నిచర్, వస్తువులను మందుబాబులు ధ్వంసం చేశారు. పరస్పరం రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని తాగుబోతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more