పెన్షన్లపై నిసిగ్గుగా జగన్ అబద్దాల ప్రచారం చేస్తున్నారు: శ్రావణ్ కుమార్

ABN , First Publish Date - 2022-01-03T18:22:54+05:30 IST

పెన్షన్లపై నిసిగ్గుగా సీఎం జగన్ అబద్దాల ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత శ్రావణ్ కుమార్ విమర్శించారు.

పెన్షన్లపై నిసిగ్గుగా జగన్ అబద్దాల ప్రచారం చేస్తున్నారు: శ్రావణ్ కుమార్

గుంటూరు : పెన్షన్లపై నిసిగ్గుగా సీఎం జగన్ అబద్దాల ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత శ్రావణ్ కుమార్ విమర్శించారు. వాస్తవాలను పక్కన పెట్టి పెన్షన్లపై ప్రచారం చేస్తున్నారన్నారు. కేవలం ఐదు లక్షల పెన్షన్లు మాత్రమే కొత్తవి ఇచ్చారని.. కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి రెండున్నర ఏళ్ళ పాటు పింఛన్ ఇచ్చారన్నారు. పదవులన్నీ కులం చూసే ఇచ్చారన్నారు. వాలంటీర్ వ్యవస్థకు మొత్తం పగ్గాలు అప్పగించారన్నారు. తాడికొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై రాళ్ళు రువ్వారని శ్రావణ్ కుమార్ విమర్శించారు.


Read more