గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-10-07T13:06:23+05:30 IST

దసరా పండగ సెలవులకు జిల్లాకు వచ్చి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే వారి సౌకర్యార్థం గుంటూరు మీదగా ప్రత్యేక రైళ్లను

గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

గుంటూరు: దసరా పండగ సెలవులకు జిల్లాకు వచ్చి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే వారి సౌకర్యార్థం గుంటూరు మీదగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు. 07440 నరసపూర్‌ - వికారబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 7వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.40కి గుంటూరు వచ్చి శనివారం ఉదయం 10 గంటలకు వికారా బాద్‌ చేరుకొంటుంది. నెంబరు. 07439 సికింద్రాబాద్‌-నరసపూర్‌ ప్రత్యేక రైలు ఈ నెల 8న శనివారం రాత్రి 10.35 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.45కి పిడుగురాళ్ల, 2.30కి సత్తెనపల్లి, ఆదివారం 4.15కి గుంటూరుకు చేరుకుంటుంది. నెంబరు. 07440 నరసపూర్‌ - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 9న ఆదివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.40కి గుంటూరు, సోమవారం ఉదయం 7.50కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. ఈ రైళ్లలో 30 శాతం అదనపు ఛార్జీని వసూలు చేస్తారు. 

Read more