Hyd to Tirupati: ఈ నెల 20 లోపు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా..?

ABN , First Publish Date - 2022-10-17T22:06:10+05:30 IST

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు..

Hyd to Tirupati: ఈ నెల 20 లోపు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా..?

రేణిగుంట: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ - తిరుపతి (sc to tpty trains) మధ్య వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను (Special Trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. ఈ నెల 19న సికింద్రాబాద్‌లో ఈ ప్రత్యేక రైలు (Train No.07485) రాత్రి 8.25 గంటలకు బయలుదేరి నల్గొండ (Nalgonda), మిర్యాలగూడ (Miryalaguda), గుంటూరు (Guntur), తెనాలి (Tenali), ఒంగోలు (Ongole), నెల్లూరు (Nellore), గూడూరు (Gudur), రేణిగుంట స్టేషన్ల (Renigunta Railway Station) మీదుగా మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతికి (Tirupati) చేరుకుంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో మరో ప్రత్యేక రైలు(02763) బయలుదేరి రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్‌, వరంగల్‌, ఖాజీపేట మీదుగా మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందని సీపీఆర్‌వో తెలిపారు.

Updated Date - 2022-10-17T22:06:10+05:30 IST