Somu Veerraju: జగన్‌కు సోమువీర్రాజు లేఖ

ABN , First Publish Date - 2022-10-05T00:03:45+05:30 IST

సీఎం జగన్‌రెడ్డికి బీజేపీ నేత సోమువీర్రాజు Somu (Veerraju) లేఖ (letter) రాశారు. విశాఖలో దసపల్లా భూములు

Somu Veerraju: జగన్‌కు సోమువీర్రాజు లేఖ

అమరావతి: సీఎం జగన్‌రెడ్డికి బీజేపీ నేత సోమువీర్రాజు Somu (Veerraju) లేఖ (letter) రాశారు. విశాఖలో దసపల్లా భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపించారు. దసపల్లా భూములను బిల్డర్లకు అప్పగించడానికి రంగం సిద్ధమైందని, దీని వెనుక వైసీపీ నేతల భూకుంభకోణం దాగి ఉందని విమర్శించారు. దసపల్లా భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడాలని సోమువీర్రాజు పిలుపునిచ్చారు. మరోవైపు దసపల్లా భూముల్లో బహుళ అంతస్థుల నిర్మాణానికి సంబంధించిన కుదుర్చుకున్న అగ్రిమెంట్లతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లు వెలుగులోకి రావడంతో వైసీపీ పెద్దల్లో అలజడి మొదలైంది. ఎష్యూర్‌ సంస్థకు హైదరాబాద్‌కు చెందిన అవియాన్‌ రియల్టర్‌ సంస్థ నుంచి నిధులు బదలాయింపు జరిగినట్టు, అలాగే కొందరికే ప్రయోజనం కలిగించేలా రూపొందించిన డెవలప్‌మెంట్‌ అగ్రిమెంటు డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. 


ఈ వ్యవహారంలో వైసీపీ ప్రముఖుడి కుటుంబ సభ్యులకు సంబంధం వుందని ప్రచారం జరుగుతుండడంతో...అసలు ఆ డాక్యుమెంట్లు బయటకు ఎలా వచ్చాయని ఆయన ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు. దసపల్లా భూముల వ్యవహారంలో వైసీపీ కీలక నేత ఒకరు అడ్డగోలుగా లబ్ధి పొందినట్టు నగరంలో ప్రచారం జరుగుతోంది. ఆయన కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం జరిగిందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. సదరు నేతకు వైసీపీలో ప్రత్యర్థిగా వున్న నేత అనుయాయులే ఆ కీలక డాక్యుమెంట్లు బయటపెట్టారని తెలిసింది. ఆ అనుయాయులు ఎవరన్నది కీలక నేత, ఆయన మద్దతుదారులు సమాచారం సేకరిస్తున్నారు. కాగా సుమారు మూడు వేల రూపాయల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో వైసీపీ కీలక నేత రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. 

Read more