Jagan సర్కార్‌పై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు
ABN , First Publish Date - 2022-05-25T20:52:58+05:30 IST
జగన్ సర్కార్‌పై బీజేపీ నేత సోము వీర్రాజు (Somu Veerraju) తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: జగన్ సర్కార్‌పై బీజేపీ నేత సోము వీర్రాజు (Somu Veerraju) తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి మారణహోమం కావాలన్నారు. ప్రభుత్వ వైఫల్యమే కోనసీమ అల్లర్లకు కారణమని విమర్శించారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్యలో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆనంతబాబును పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.