-
-
Home » Andhra Pradesh » somu veerraju fire on ycp govt anr-MRGS-AndhraPradesh
-
Somu Veerraju: హిందూ ద్వేషాన్ని వైసీపీ ప్రభుత్వం వెళ్ళగక్కుతోంది...
ABN , First Publish Date - 2022-10-06T19:29:02+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అమరావతి (Amaravathi): వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం (Kanipakam) వినాయకుడు (Vinayakudu) అభిషేకం ధర ఏడు రెట్లు పెంచడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. రూ. 750 నుంచి రూ. 5000 పెంచుతూ నిర్ణయం తీసుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇటువంటి విఘాత నిర్ణయాలు పర్వదినాన్న తీసుకోవడం వెనుక హిందూ ద్వేషాన్ని వైసీపీ ప్రభుత్వం వెళ్ళగక్కుతోందని దుయ్యబట్టారు. అభిషేకంపై పెంచిన ధరను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమలకు వచ్చే భక్తులకు కేవలం పులిహోరతో సరిపెడుతున్నారని, చక్రపొంగలి, వడ తదితరాలు పర్వదినాల్లో ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు.