సందేహమే లేదు.. జనసేన, BJP కలిసే ఉన్నాయి: Somu Veerraju

ABN , First Publish Date - 2022-07-05T19:40:00+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మొన్నొక వీడియో సందేశం పంపారని.. దానిలో జనసేన శ్రేణులు ప్రధాన మంత్రి మోదీ(PM Modi) సభను..

సందేహమే లేదు.. జనసేన, BJP కలిసే ఉన్నాయి: Somu Veerraju

Vijayawada : జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మొన్నొక వీడియో సందేశం పంపారని.. దానిలో జనసేన శ్రేణులు ప్రధాన మంత్రి మోదీ(PM Modi) సభను జయప్రదం చెయ్యాలని కోరారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) తెలిపారు. జనసేన(Janasena), బీజేపీ(BJP) కలిసే ఉన్నాయని.. అందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని సోము వీర్రాజు తెలిపారు. నిన్న ప్రధాన మంత్రి పర్యటన బాగా జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొన్ని శక్తులకు వారి కుటుంబాలు మాత్రమే కావాలని... కానీ బీజేపీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Read more