ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందిస్తోంది: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-03-02T21:08:52+05:30 IST

సర్పంచుల అధికారాలను కుటుంబ పార్టీలు లాగేసుకున్నాయని సోమువీర్రాజు విమర్శించారు.

ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందిస్తోంది: సోమువీర్రాజు

అమరావతి: సర్పంచుల అధికారాలను కుటుంబ పార్టీలు లాగేసుకున్నాయని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన రూ.7,800 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు వెళ్లకుండా వైసీపీ దోచుకుంటోందని ఆరోపించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. రేషన్ రాయితీలో బియ్యానికి రూ.33 కేంద్రమే ఇస్తోందన్నారు. రైతులను ఏపీ ప్రభుత్వం ఆదుకోవడంలేదని విమర్శించారు. నిధుల మంజూరులో కేంద్రం ఎంత సహకారం చేసిందో వివరిస్తామని సోమువీర్రాజు పేర్కొన్నారు.

Updated Date - 2022-03-02T21:08:52+05:30 IST