వైసీపీ ప్రభుత్వంపై సోమువీర్రాజు ఫైర్

ABN , First Publish Date - 2022-03-08T23:42:46+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై సోమువీర్రాజు ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై సోమువీర్రాజు ఫైర్

కృష్ణాజిల్లా: సమగ్ర అభివృద్ధిపై దృక్కోణం కావాలని, వైసీపీ ప్రభుత్వానికి సరైన దృక్కోణం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. 7000 కోట్లు కేంద్రం జలజీవన్ మిషన్‌కు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకులేని పరిస్థితి ఉందన్నారు. జలజీవన్ మిషన్‌లో ప్రతి ఇంటికి  కుళాయి కేంద్రం ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం కుళాయిలు ఇవ్వడం లేదన్నారు. రేషన్ బియ్యానికి రెండు రూపాయల రాయితీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుందన్నారునరేంద్ర మోదీ ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి కి నాంది పలికారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడపోర్టు లు లేవని, గుజరాత్‌లో 11 పోర్టులు 24 జట్టీలు కట్టారని చెప్పారు. మన రాష్ట్రంలో 14జట్టీలు కట్టడానికి అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

Updated Date - 2022-03-08T23:42:46+05:30 IST