పేదల ఇళ్లకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోంది: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2022-02-20T19:49:40+05:30 IST
పేదల ఇళ్లకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోందని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. అవి తమవని ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని తప్పుబట్టారు.

అమరావతి: పేదల ఇళ్లకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోందని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. అవి తమవని ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడిన ఘనత వాజ్పేయి, మోదీదేనని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్పష్టమైన ఇసుక విధానం తెస్తామని సోము వీర్రాజు ప్రకటించారు.