సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలి: శ్రీకాంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-01-28T21:26:48+05:30 IST
తమ మనోభావాలను కించపరిచేలా బీజేపీ నేత సోమువీర్రాజు మాట్లాడారని విప్ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కడప: తమ మనోభావాలను కించపరిచేలా బీజేపీ నేత సోమువీర్రాజు మాట్లాడారని విప్ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమువీర్రాజు వ్యాఖ్యలను వెంటనే వెనెక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్లు, రాజకీయా నాయకులు తమను కించపరచోద్దని సూచించారు. వీర్రాజు వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ, కడప జిల్లా మీద సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసేలా సోమువీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని ఆక్షేపించారు. మనుషులను చంపుకునే కడప వారికి ఎయిర్పోర్ట్ ఎందుకనడం దారుణమని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.